: తప్పుడు లావాదేవీలు నడుపుతున్న బ్యాంకులపై కొరడా ఝళిపించనున్న ఆర్బీఐ
తప్పుడు లావాదేవీలకు పాల్పడుతున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మండిపడింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులను ఆర్బీఐ హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు ఉద్యోగులే నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ ప్రకటనలో ఆర్బీఐ హెచ్చరించింది. కాగా, బడాబాబులు, బ్యాంకు సిబ్బందితో పరిచయాలు ఉన్న వారు అధికమొత్తంలో పెద్దనోట్లను మార్చుకుంటున్నారనే వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా, సామాన్య ప్రజలు కూడా ఈ విషయమై విమర్శలు గుప్పిస్తున్నారు. గంటల తరబడి తాము ‘క్యూ’లో నిలబడినప్పటికీ, చిన్ననోట్లు తమకు దక్కడం లేదని, పరపతి ఉన్న వాళ్లు మాత్రం దర్జాగా వచ్చి వాళ్లకు అవసరమైన మొత్తాలను పట్టుకుపోతున్నారనే ఆరోపణలు నినిపిస్తున్నాయి.