: నేలరాలిన ధృవతార... సంగీత దిగ్గజం మంగళంపల్లి బాలమురళీకృష్ణ కన్నుమూత


ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ (86) కన్ను మూశారు. చెన్నైలోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1930 జూలై 6న తూర్పుగోదావరి జిల్లాలోని శంకరగుప్తంలో ఆయన జన్మించారు. కర్ణాటక సంగీతంలో విద్వాంసుడిగా కీర్తిగడించిన ఆయన వీణ, మృదంగం, కంజీరలు వాయించడంలో నిష్ణాతులు. ఎన్నో సినిమాల్లో పాటలు పాడి అలరించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఆయన కీర్తి కిరీటంలో కలికితురాళ్లు. కేవలం గాత్రదానం చేయడమే కాకుండా, స్వరకల్పన చేయడంలో ఆయన దిట్ట. నటనలో కూడా ఆయన ప్రావీణ్యం సంపాదించారు. కేవలం 8 ఏళ్లకే కచేరీ చేయడం ద్వారా బాలమేధావిగా గుర్తింపు పొందిన ఆయన, ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా సంగీత కచేరీలు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరి పీఠాలకు ఆయన ఆస్థాన విద్వాంసుడిగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News