: బాలుడిని ట్యాంకర్ కింద పడేసి రాక్షసత్వాన్ని చూపిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు
తాము అదుపులోకి తీసుకున్న బందీలను, అనుమానితులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు క్రూరంగా చంపేస్తున్నారు. వారి ప్రాణాలు తీస్తున్న సమయంలో వీడియోలు తీసి వాటిని ఇంటర్నెట్‌లో పెడుతున్నారు. తాజాగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. తాము ఓ బాలుడిని చంపేస్తుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. అందులో కొందరు ఉగ్రవాదులు ఓ బాలుడి చేతులు వెనక్కి విరిచి కట్టి, బూటు కాళ్లతో తన్ని హింసించారు. అనంతరం సదరు బాలుడి కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లి యుద్ధ ట్యాంకర్‌కు ఎదురుగా పడేసి ప్రాణాలు తీయాలనుకున్నారు. అయితే, ఆ బాలుడు తన ప్రాణాలు కాపాడుకునేందుకు ట్యాంకర్ పక్కకు జరిగే ప్రయత్నం చేశాడు. దీంతో ఉగ్రవాదులు ఆ బాలుడిపై కాల్పులు జరిపారు. మళ్లీ ట్యాంకు ముందు పడేసి బాలుడిపై నుంచి ట్యాంకర్ ఎక్కించి అత్యంత కిరాతకంగా చంపేశారు.