: మోదీకి పెరిగిపోతున్న పాప్యులారిటీతో ప్రతిపక్షాలు వణికిపోతున్నాయి: ఢిల్లీలో వెంకయ్య నాయుడు
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షాల తీరుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షాలు సభను ఎందుకు జరగనివ్వడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటులో చర్చ జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అన్నారు. చర్చలను ఎందుకు అడ్డుకుంటున్నారన్న విషయంపై కనీసం ఆందోళన చేస్తున్న వారయినా ఓ స్పష్టతకు రావాలని సూచించారు. ప్రతి అంశానికి ప్రధాని మోదీని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయిందని వెంకయ్యనాయుడు అన్నారు. మోదీకి రోజురోజుకీ పెరిగిపోతున్న పాప్యులారిటీతో తమ ఉనికి ఏమైపోతుందోనని ప్రతిపక్షాలు వణికిపోతున్నాయని చెప్పారు.