: పెద్ద నోట్ల రద్దుపై పోరు... ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్
పెద్ద నోట్ల రద్దుపై మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్న ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ నేతలు ఈ రోజు తమ కార్యకర్తలతో కలిసి ఆందోళన నిర్వహించి, కేంద్ర సర్కారు తీరుకి నిరసనగా నినాదాలు చేశారు. మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వైపుగా ర్యాలీగా కదిలారు. దీంతో ఆందోళనలో పాల్గొన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు ఆ రాష్ట్ర మంత్రి కపిల్ మిశ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనను విరమించాలని చెప్పినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ర్యాలీలో మరో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా పాల్గొన్నారు. అయితే, ఆయనను పోలీసులు అరెస్టు చేయలేదు.