: ఈ ఇబ్బందులు ఎక్కువ కాలం కొనసాగితే జీడీపీపై ప్రభావం పడుతుంది: ఫిచ్


నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులు ఎక్కువ కాలం కొనసాగితే జీడీపీ (స్థూలజాతీయోత్పత్తి) వృద్ధి రేటు మీద ప్రభావం పడుతుందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తెలిపింది. పెద్ద నోట్లను రద్దు చేయడంతో దేశంలో నిధుల కొరత ఏర్పడిందని... దీంతో, ఆర్థిక కార్యకలాపాలు దాదాపు స్తంభించాయని, ఆర్థిక వ్యవస్థకు అంతరాయం ఏర్పడిందని చెప్పింది. పెద్ద నోట్లు రద్దు వల్ల ఏర్పడిన ఇబ్బందులను త్వరగా తొలగించుకుంటే ప్రతికూల ప్రభావం పెద్దగా ఉండదని తెలిపింది.

  • Loading...

More Telugu News