: పరిస్థితి మూడు రోజుల్లో చక్కబడుతుందన్నారు.. ఇప్పటికీ చక్కబడలేదేం?: హైదరాబాద్‌లో సీపీఎం ఆందోళన
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారంటూ హైదరాబాద్‌లోని రిజర్వ్‌బ్యాంక్ శాఖ కార్యాలయం ఎదుట సీపీఎం నేతలు, కార్యకర్తలు ఈ రోజు ఆందోళన నిర్వహించారు. ముందు జాగ్రత్తలేవీ తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయంతో నల్లకుబేరులు ఏపాటి కష్టాలు పడుతున్నారోగానీ సామాన్యులు మాత్రం వీధిన పడ్డారని వారు అన్నారు. పెద్దనోట్లను రద్దు చేసి రెండు వారాలు అయినప్పటికీ ప్రజల కష్టాలు అలాగే ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు రెండు మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని అందని, కానీ ఇంతవరకు పరిస్థితిలో మార్పులేదని అన్నారు. అనంతరం బ్యాంకు అధికారులకు సీపీఎం నేతలు వినతిపత్రం అందజేశారు.