: నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయమిదే: హీరోయిన్ అమలాపాల్


సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకుపోతూ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటున్న సమయంలో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది అమలాపాల్. డైరెక్టర్ విజయ్ ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఏడాది తిరగక ముందే భర్తతో విడిపోవాలని ఆమె నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాక్ కు గురయ్యారు. విడాకులు కావాలంటూ ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో, చాలా రోజుల తర్వాత తమ బ్రేకప్ గురించి అమలాపాల్ స్పందించింది. తన జీవితంలో తాను తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయం ఇదే అని ఆమె తెలిపింది. విజయ్ ను తాను ఇప్పటికీ ప్రేమిస్తున్నానని... ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పింది. 18 ఏళ్లకే హీరోయిన్ అయిన తాను, 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నానని... ఏడాది తిరగక ముందే విడిపోవాలని అనుకున్నానని... అయితే, ఆ టైమ్ లో తనకు సరైన సలహా ఇచ్చేవారు ఎవరూ లేకపోయారని అమలాపాల్ తెలిపింది. విజయ్ ను పెళ్లి చేసుకోవడం తప్పా? కరెక్టా? అనే విషయాన్ని పక్కనబెడితే... ఆ వయసులో పెళ్లి చేసుకోవడం మాత్రం తప్పే అని చెప్పింది. జీవితం ఎప్పుడు, ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టమని తెలిపింది.

  • Loading...

More Telugu News