: ఎగిరొచ్చిన రాకాసి అలలు... జపాన్ ను కుదిపేస్తున్న సునామీ


జపాన్ లో ఉదయం 6:40 గంటల సమయంలో 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా సునామీ చెలరేగింది. భూకంపం తరువాత కాసేపటికే పసిఫిక్ మహా సముద్రంలో సునామీ అలలు ఎగసిపడి పుకుషిమా అణుశక్తి కేంద్రాన్ని ముంచెత్తాయి. అప్పటికే ఈ కేంద్రాన్ని ఖాళీ చేయించారు. సునామీ రావచ్చని ముందే హెచ్చరికలు జారీ చేసి వుండటంతో మానవ నష్టం జరగలేదుగానీ, ఆస్తి నష్టం భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈశాన్య జపాన్ ప్రాంతంలోని గ్రామాలను సైతం అధికారులు త్వరితగతిన ఖాళీ చేయించారు. సునామీ అలలు 3 నుంచి 8 మీటర్ల ఎత్తు వరకూ ఉన్నట్టు సమాచారం. సునామీ చూపించిన ప్రభావంపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News