: వాట్సాప్‌లో రేప్ వీడియోలు.. కేంద్రానికి సుప్రీంకోర్టు మొట్టికాయ‌లు


మైక్రోబ్లాంగింగ్ సైట్ వాట్సాప్‌లో అత్యాచార వీడియోల నియంత్ర‌ణ‌పై ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం 11 నెల‌లుగా నోరు మెద‌క‌పక‌పోవ‌డంపై అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కేంద్రానికి మొట్టికాయ‌లు వేసింది. సైబ‌ర్ నేరాల కేసుల దర్యాప్తుపై స్ప‌ష్ట‌మైన విధివిధానాలు రూపొందించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టింది. వారం రోజుల్లో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. వాట్సాప్‌లో అత్యాచార వీడియోలు ప్ర‌చారం కావ‌డంపై హైద‌రాబాద్‌కు చెందిన స్వ‌చ్ఛంద సంస్థ 'ప్ర‌జ్వ‌ల' గ‌తంలో సుప్రీంకోర్టుకు లేఖ‌రాసింది. ఈ లేఖ‌తోపాటు వాట్సాప్‌లో ప్ర‌చారంలో ఉన్న రెండు అత్యాచార వీడియోల‌ను పెన్ డ్రైవ్‌ ద్వారా అప్ప‌టి చీఫ్ జ‌స్టిస్ హెచ్.ఎల్.దత్తుకు పంపించింది. కోర్టు దీనిని సుమోటోగా స్వీక‌రించింది. కేసు ద‌ర్యాప్తు చేసి నిందితుల‌ను అదుపులోకి తీసుకోవాల‌ని ఆదేశించింది. అలాగే సామాజిక మాధ్యమాల్లో అశ్లీల దృశ్యాలు ప్ర‌చారం కాకుండా నియంత్రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార‌శాఖ‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలు జారీ చేసి 11 నెల‌లు గ‌డుస్తున్నా కేంద్రం నుంచి ఎటువంటి స‌మాధానం రాక‌పోవ‌డంపై జ‌స్టిస్ ఎంబీ లోకూర్‌, జ‌స్టిస్ యూయూ ల‌లిత్‌తో కూడి ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశిస్తూ శుక్ర‌వారానికి కేసును వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News