: జకీర్ నాయక్ కు ఇంటర్ పోల్ నోటీస్
వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ను భారత్ కు రప్పించేందుకు జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) ప్రయత్నాలు ప్రారంభించింది. రెండు రోజుల క్రితం జకీర్ నాయక్ నేతృత్వంలోని 'పీస్' టీవీకి కంటెంట్ అందిస్తున్న హర్మనీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి అనుబంధ సంస్థలపై ఎన్ఐఏ దాడులు చేసి, వివిధ పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లా బేకరీలో ఉగ్రదాడి అనంతరం ఇండియా నుంచి చాకచక్యంగా తప్పించుకుని సౌదీ అరేబియా వెళ్లిపోయిన జకీర్ నాయక్ తనపై విచారణ ప్రారంభమైందని తెలియగానే, స్కైప్ లో మీడియాతో మాట్లాడుతూ, ఏడాది తరువాతే తాను మళ్లీ ఇండియాలో అడుగుపెడతానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని, అనంతరం ఇంటర్ పోల్ సాయంతో ఆయనపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఎన్ఐఏ భావిస్తోంది.