: అబార్షన్ లపై కఠిన నిబంధనను సడలించిన పోప్ ఫ్రాన్సిస్


అబార్షన్ (గర్భస్రావం)లను క్యాథలిక్కులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అది ఒక జీవితాన్ని నాశనం చేస్తుందని నమ్ముతారు. అందుకే అబార్షన్ చేయించుకోవడం దారుణమైన పాపమని వాటికన్ అభిప్రాయపడుతూ వస్తోంది. అలాంటి అబార్షన్ వ్యవహారంపై పోప్ ఫ్రాన్సిస్ ఇప్పుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌ర్భ‌స్రావం చేసుకున్న మ‌హిళ‌ల‌కు క్ష‌మాభిక్ష క‌ల్పించాల‌ని ఆయన నిర్ణ‌యించారు. అలాగే, అబార్ష‌న్ చేయించుకున్న మ‌హిళ‌లకు ప్ర‌తి చ‌ర్చిలోనూ క్ష‌మాభిక్ష కల్పించే అధికారాలను ఆయా క్రైస్త‌వ పూజారులకు (ఫాదర్లు) దఖలు పరుస్తూ ఆదేశాలు జారీ చేశారు. సాక్షాత్తూ దేవుని ప్రతినిధిగా భావించే పోప్ ఫ్రాన్సిస్ అబార్షన్ పై తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ... ఈ ఆదేశాల్లో దేవుడు ద‌య‌చూప‌లేని పాపం అంటూ ఏదీ లేద‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News