: బుల్లి స్టార్ సెలబ్రిటీల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆరాధ్య
బాలీవుడ్ స్టార్ దంపతులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ దంపతుల గారాలపట్టి ఆరాధ్యా బచ్చన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనెల 16న ఆరాధ్య 6వ పుట్టిన రోజు జరుపుకుంది. అయితే తన సెలబ్రిటీ ఫ్రెండ్స్ కోసం వేడుకలను ఈనెల 20న నిర్వహించింది. ఈ వేడుకల్లో బుల్లి సెలబ్రిటీలు పాల్గొని ఆరాధ్యకు శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కొడుకు అజాద్ తల్లి కిరణ్ రావుతో కలసి వచ్చాడు. అక్షయ్ కుమార్ కుమార్తె నిటారాను తీసుకుని, అతని భార్య ట్వింకిల్ ఖన్నా వచ్చింది. సంజుబాబా (సంజయ్ దత్) కవల పిల్లలు షహ్రాన్, ఇఖ్రా తల్లి మాన్యతతో కలసి వచ్చారు. సోనాలీ బెంద్రే, గోల్డీ బెల్ దంపతులు కొడుకు రణవీర్ తోపాటు సెలబ్రేషన్స్ లో జాయిన్ అయ్యారు. ఈ వేడుకల ఏర్పాట్లను తాత అమితాబ్, తండ్రి అభిషేక్ బచ్చన్ దగ్గరుండి చూసుకున్నారు. ఇంకా ఇందులో ఆరాధ్య అమ్మమ్మ బృందా రాయ్, బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్-నైనా దంపతులు, సెలెబ్రిటీ ఫొటోగ్రాఫర్ డాబు రత్నాని కుటుంబం, నటి తారా శర్మ, సోనాలి కులకర్ణి వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు.