: అక్రమ సంపాదనను ఎలా మార్చుకోవాలో తెలియక జగన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు: పల్లె రఘునాథరెడ్డి
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న అక్రమ సంపాదనను ఎలా మార్చుకోవాలో తెలియక వైఎస్సార్సీపీ అధినేత జగన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దుపై జగన్ ఇంతవరకూ స్పందించకపోవడం దారుణమన్నారు. నోట్ల రద్దు తర్వాత జగన్ అడ్రస్ గల్లంతైందని ఎద్దేవా చేశారు. అక్రమ సంపాదనలో జగన్, ఆ పార్టీ నేతలు ఆరితేరిపోయారని, ఇటువంటి నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత లేదని పల్లె రఘునాథరెడ్డి వ్యాఖ్యానించారు.