: ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టిన సభ్యులు.. గంటలో మూడోసారి వాయిదా పడిన రాజ్యసభ
వాయిదా అనంతరం తిరిగి 12 గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాలు మళ్లీ అదే తీరుని కనబరిచాయి. పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చ చేపట్టవలసిందేనని గందరగోళం సృష్టించాయి. పెద్దనోట్ల అంశంపై ప్రధాని మోదీ సభకు వచ్చి సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. వారు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను ఈ రోజు మధ్యాహ్నం 12.34 వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గంట సమయంలో రాజ్యసభ మూడు సార్లు వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభలో రైల్వే శాఖమంత్రి సురేష్ ప్రభు నిన్న జరిగిన ఘోర రైలు ప్రమాదంపై మాట్లాడుతున్నారు.