: క్యూలైన్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించాలి: కేవీపీ
దేశవ్యాప్తంగా నగదు కొరత కష్టాలు వరుసగా 13వ రోజు కొనసాగుతున్నాయి. పెద్దనోట్ల రద్దుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఈ రోజు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలైన్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించాలని ఆయన కోరారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు మహిళలు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.