: పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం


పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దేశ వ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. అయితే, ఇంత‌కు ముందు ఆయా పిటిష‌న్ల‌ను అన్నింటినీ కొట్టి వేయాల‌ని కోరిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈ సారి మాత్రం అన్ని పిటిషన్లను ఒకే కోర్టుకు బదిలీ చేసేలా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయ‌స్థానానికి విజ్ఞ‌ప్తి చేసుకుంది. ఈ పిటిషన్ ఎల్లుండి విచారణకు వస్తుంది.

  • Loading...

More Telugu News