: 'శాటర్ డే నైట్ లైవ్'పై మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్


అమెరికాలో అత్యంత పాప్యులర్ అయిన టీవీ కామెడీ షో 'శాటర్ డే నైట్ లైవ్' షోపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఈ షోకి చెందిన కొన్ని ఎపిసోడ్స్ ను తాను చూశానని... ఇవన్నీ ఏకపక్షంగానే ఉన్నాయని... ఎదుటి వ్యక్తులకు సమాధానం చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం లేదని ట్వీట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పేరుకే కామెడీ షో అని... కానీ, దీంట్లో ఏమాత్రం కామెడీ లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా, తనపై జోకులు వేస్తే ఇకపై చూస్తూ ఊరుకోననే రీతిలో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు పంపారు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇలాంటి షోలు తనపై చేయడం కుదరదని సంకేతాలు ఇచ్చారు. వాస్తవానికి దేశాధ్యక్షుడితో పాటు, ఇతర రాజకీయ నేతలను ఎగతాళి చేస్తూ కామెడీ షోలు నిర్వహించడం అమెరికాలో పరిపాటే. చాలా కాలంగా ఇలాంటి షోలు వస్తున్నాయి. ప్రజలు కూడా ఇలాంటి షోలను బాగానే ఆదరిస్తున్నారు.

  • Loading...

More Telugu News