: పాక్ కాల్పుల్లో జ‌వాను వీర‌మ‌ర‌ణం.. మ‌రో న‌లుగురికి గాయాలు


కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి య‌థేచ్ఛ‌గా తూట్లుపొడుస్తున్న పాకిస్థాన్ తాజాగా మ‌రోమారు ఒప్పందాన్ని ఉల్లంఘించింది. స‌రిహ‌ద్దులోని భార‌త స్థావ‌రాల‌పై కాల్పులు జ‌రిపింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ ఆర్మీ జ‌వాను వీర‌మ‌ర‌ణం పొంద‌గా మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జ‌మ్ముక‌శ్మీర్ రాజౌరీ సెక్టార్‌లో ఆదివారం రాత్రి పాక్ ద‌ళాలు కాల్పులు జ‌రిపిన‌ట్టు అధికారులు తెలిపారు. పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రాయ్ సింగ్ అమ‌రుడు కాగా మ‌రో న‌లుగురు గాయ‌ప‌డిన‌ట్టు పేర్కొన్నారు. పాక్ కాల్పుల‌కు దీటుగా బ‌దులిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. కాగా పాక్ కాల్పుల విర‌మ‌ణను ఉల్లంఘించ‌డం శ‌నివారం నుంచి ఇది మూడోది కావ‌డం గ‌మ‌నార్హం.

  • Loading...

More Telugu News