: రూ.పది నాణేలను నిరభ్యంతరంగా తీసుకోండి.. నకిలీ వదంతులు నమ్మొద్దు: ఆర్బీఐ
మార్కెట్లో పది రూపాయల నకిలీ నాణేలు చలామణిలో ఉన్నాయని వస్తున్న వార్తలు ఉత్త వదంతులేనని, వాటిని నమ్మొద్దని ఆర్బీఐ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నకిలీ పది రూపాయల నాణేలు లేవని, వాటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని తెలిపింది. రూ.పది నాణేలపై ఉన్న అనుమానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. జూలై 2011లోనే రూపీ చిహ్నాన్ని నాణేలపై ముద్రించామని, ఆ గుర్తు ఉన్న, లేని నాణేలు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. నాణేలు ఎక్కువ కాలం మార్కెట్లో చలామణిలో ఉండేలా ముద్రణ జరుగుతుందని, ఈ క్రమంలో ఎన్నో మార్పులు కూడా ఉంటాయని పేర్కొంది. నకిలీ నాణేల వదంతులను నమ్మకుండా అందరూ ఆ నాణేలను అంగీకరించాలని కోరింది.