: మనిషికి, దేవుడికి మధ్య సంబంధం చాలా వ్యక్తిగతం: సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్


మనిషికి దేవుడికి మధ్య సంబంధం చాలా వ్యక్తిగతమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీఐజే) జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారీమన్ రాసిన ‘ది ఇన్నర్ ఫైర్, ఫెయిత్, చాయిస్ అండ్ మోడ్రన్ డే లివింగ్ ఇన్ జొరాష్ట్రియనిజమ్’ అనే పుస్తకాన్ని ఠాకూర్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషికి- దేవుడికి మధ్య సంబంధం చాలా వ్యక్తిగతమైందని, దానికి ఇతరులకు ఏమాత్రం సంబంధం ఉండదని అన్నారు. రాజకీయ భావజాలాల కారణంగా కన్నా మత యుద్ధాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మత విశ్వాసాల పేరిట ఎంతో విధ్వంసం, రక్తపాతం చోటుచేసుకున్నాయని అన్నారు. ‘నా మతం ఏమిటి? నా దేవుడితో నేనెలా అనుసంధానం అవుతాను?’ అనేవి ఇతరులకు అవసరం లేని విషయాలన్నారు.

  • Loading...

More Telugu News