: పుట్టినరోజు సంబరాలలో మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్
ప్రముఖ నటి, మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ తన 41వ పడిలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దుబాయ్ లో పర్యటిస్తున్న సుస్మిత, నిన్న తన కుటుంబసభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. సుస్మిత తల్లి సుబ్రా, కూతుళ్లు రీనా, ఆలీషా లతో పాటు ఆమె సన్నిహితులతో సరదాగా గడిపింది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను తన ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ ఖాతాలలో పోస్ట్ చేసింది.