: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్... స్కోరు 75/1


భారత్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ హమీద్ 25 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. మరో ఎండ్ లో కెప్టెన్ కుక్ 47 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. వన్ డౌన్ గా రూట్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 75 పరుగులు. విజయ లక్ష్యానికి ఇంగ్లండ్ ఇంకా 330 పరుగులు వెనకబడి ఉంది. ఈ రోజు మరో 8 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

  • Loading...

More Telugu News