: భారత్ డ్రోన్ ను కూల్చివేశామంటున్న పాక్ సైన్యం
శనివారం సాయంత్రం భారత్ కు చెందిన ఒక డ్రోన్ ను కూల్చివేశామని పాక్ ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. సరిహద్దు దాటి తమ భూభాగంలోకి భారత డ్రోన్ ప్రవేశించిందని... అందుకే దాన్ని కూల్చి వేశామని ఆయన తెలిపారు. డ్రోన్ శకలాలు రాక్ చక్రి సెక్టార్ లోని అగాయ్ పోస్టు వద్ద పడ్డాయని చెప్పారు. అయితే, ఈ ఘటనపై ఇంతవరకు భారత్ స్పందించలేదు. మరోవైపు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఎదురెదురు కాల్పుల్లో పాక్ కంటే భారత సైనికులే ఎక్కువ మంది చనిపోయారని పాక్ 10 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మాలిక్ జఫార్ ఇక్బాల్ చెప్పారు. పాక్ సైనికులు 20 మంది చనిపోయారని... భారత సైనికులు కనీసం 40 మంది చనిపోయారని తెలిపారు. ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే కారణంతోనే, భారత ప్రభుత్వం సైనికుల మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపుతోందని చెప్పారు.