: పని ఒత్తిడి నేపథ్యంలో.. నెల్లూరు జిల్లా ఎస్బీఐ బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ షరీఫ్ మృతి


నెల్లూరు జిల్లా బార్కాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ షరీఫ్ మృతి బ్యాంకు ఉద్యోగుల్లో విషాదం నింపింది. బ్యాంకులో తీవ్ర ఒత్తిడితో అస్వస్థతకు గురైన షరీఫ్ ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో వెంటనే స్పందించిన బ్యాంకు సిబ్బంది ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆయన మార్గమధ్యంలోనే మృతిచెందారు. దీంతో బ్యాంకు ఉద్యోగుల్లో విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News