: టీఆర్ఎస్ బంద్ మే 3కి వాయిదా
బయ్యారం గనులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, మే 2వ తేదీన మెదక్ జిల్లా బందుకు టీఆర్ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనిని ఆ మర్నాటికి అంటే మే 3కి వాయిదా వేశారు. మే 2న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్ఎస్ నేతలు తెలిపారు.