: జయహో సింధు.. చైనా ఓపెన్ ఫైనల్ లోకి ప్రవేశించిన తెలుగు తేజం


చైనా సూపర్‌ సిరీస్‌ ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్‌, తెలుగుతేజం పీవీ సింధు ఆ టైటిల్ కొట్టేయ‌డానికి మ‌రో అడుగు దూరంలో ఉంది. ఈ రోజు జ‌రిగిన సెమీఫైనల్‌ మ్యాచులో త‌న ప్ర‌త్య‌ర్థి దక్షిణ కొరియా క్రీడాకారిణి సంగ్‌జీ హ్యూన్‌పై పీవీ సింధు అద్భుత‌మైన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సింధు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. హ్యూన్‌పై 11-21, 23-21, 21, 19 తేడాతో సింధు విజయ ఢంకా మోగించింది. ఒలింపిక్స్‌లో మెడ‌ల్ సాధించిన ఉత్సాహంతో ఇటీవ‌ల‌ ప‌లు బ్యాడ్మింట‌న్ టోర్నీల్లో పాల్గొన్న సింధు త‌న అభిమానుల‌కు నిరాశ మిగిల్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె చైనా సూపర్‌ సిరీస్‌ ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఫైనల్‌లోకి ప్ర‌వేశించ‌డంతో ఆమె మరో విజ‌యాన్ని సాధిస్తుందని అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

  • Loading...

More Telugu News