: వెబ్ క్యామ్ ఎందుకు తయారు చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!


వెబ్ క్యామ్ లు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ల్యాప్ ట్యాప్ లో వెబ్ క్యామ్ ఇన్ బిల్ట్ తో వస్తుండగా, డెస్క్ టాప్ కు వెబ్ క్యామ్ సెపరేట్ గా పెట్టుకుని ఇంట్లో జరిగిన ప్రతి సంఘటనను ఆప్తులతో సుదూరతీరాల నుంచే పంచుకుంటున్నాం. అయితే ఈ వెబ్ క్యామ్ ల రూపకల్పన చిత్రంగా జరిగింది. దాని వివరాల్లోకి వెళ్తే... లండన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఆచార్యులు (ప్రొఫెసర్స్), పరిశోధకులు, సందర్శకుల కోసం కాఫీ మిషన్ పెట్టారు. ఈ కాఫీ మిషన్లలో కాఫీ చాలా తొందరగా అయిపోయేది. కాఫీ కోసం వెళ్లిన ప్రొఫెసర్లకు ఖాళీ మిషన్ స్వాగతం పలికేది. దీని వల్ల వారి విలువైన సమయం వృథా అయ్యేది. దీంతో ఎంతగానో ఆలోచించిన మీదట మిషన్ లో కాఫీ ఉందో లేదో చూసుకునేందుకు 1991లో కెమెరా ఏర్పాటు చేశారు. దీనిని అందరు ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్ల కంప్యూటర్లకు అనుసంధానించారు. దీని ద్వారా కాఫీ మిషన్ లో కాఫీ లెవెల్ చూసిన తరువాతే ప్రొఫెసర్లు మిషన్ వద్దకు వెళ్లేవారు. 1993లో దీనికి ఫోటో తీయగల సామర్థ్యం కల్పించారు. తరువాత వీడియో చూపించే సాంకేతిక సామర్థ్యం జోడించారు. దీంతో అదిప్పుడు మనుషుల మధ్య దూరం తగ్గించి, ప్రతి ఇంట్లోనూ ఆత్మీయ బంధువైపోయింది.

  • Loading...

More Telugu News