: నితిన్, నీరజ రెస్టారెంట్ లో సమంత, నాగచైతన్య రిసెప్షన్?
టాలీవుడ్ అభిమానులను అలరిస్తున్న ప్రేమ కథల్లో సమంత, నాగచైతన్య లేటెస్ట్ ప్రేమ కథదే అగ్రస్థానం. వీరిద్దరూ తమ ప్రేమను దాచాలనుకోవడం లేదు. అందుకే, రోజుకో కొత్త విషయాన్ని రివీల్ చేస్తూ ఈ ప్రేమ జంట ఆకట్టుకుంటోంది. తాజాగా హైదరాబాదు, జూబ్లీ హిల్స్ లో 'టీ గ్రిల్స్' రెస్టారెంట్ ఓపెనింగ్ కు వచ్చిన సమంత మాట్లాడుతూ, తమ వివాహ రిసెప్షన్ ఇందులోనే జరుగుతుందని తెలిపింది. ఈ రెస్టారెంట్ సమంత బెస్ట్ ఫ్రెండ్, డిజైనర్ నీరజ కోన, ప్రముఖ నటుడు నితిన్ సంయుక్తంగా ఏర్పాటు చేసినది కావడం విశేషం. దీంతో సమంత స్నేహితురాలు నీరజ.. నితిన్ స్నేహితుడు అఖిల్ కనుక ఇందులోనే రిసెప్షన్ జరిగే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.