: ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చెప్పలేదు: పురంధేశ్వరి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని అనలేదని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఆయా దేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనాన్ని వెలికితీస్తే ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేసుకోవచ్చని మాత్రమే ఆయన వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ఈ రోజు విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దు అంశంలో వస్తున్న వదంతులను నమ్మకూడదని సూచించారు. తమ సొంత అకౌంట్లో రూ.2 లక్షలు డిపాజిట్ చేసుకుంటే ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు రద్దవుతాయని వస్తోన్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.