: చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్!
ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పలువురు సహచరులను పోగొట్టుకున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం చత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ అటవీ ప్రాంతంలో తమకు తారసపడ్డ మావోలను భద్రతాదళాలు చుట్టుముట్టగా, ఇరు పక్షాలు కాల్పులకు దిగడంతో ఇప్పటివరకూ ఐదుగురు మావోలు హతమైనట్టు తెలుస్తోంది. మిగతా మావోలు పారిపోగా, కాల్పుల ఘటనలో మృతి చెందిన మావోయిస్టులు ఎవరన్న విషయం తెలియాల్సి వుంది. ఆపై అదనపు బలగాలకు సమాచారం అందడంతో, భారీ ఎత్తున పోలీసులు ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టి పారిపోయిన వారికోసం కూంబింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది.