: వెనిజులా ప్రథమ మహిళ మేనల్లుళ్లు డ్రగ్స్ స్మగ్లర్లని నిరూపించిన అమెరికా, మార్చి 7న శిక్ష ఖరారు


వెనిజులా ఫస్ట్ ఉమెన్ సిలియా ఫ్లోర్స్ మేనల్లుళ్లు ఈఫ్రెయిన్ ఆంటానియో ఫ్లోర్స్ (29), ఫ్రాన్సిస్కో ఫ్లోర్స్ డే ఫ్రైతాస్ (30)లు డ్రగ్స్ స్మగ్లర్లని అమెరికా నిరూపించింది. వీరిద్దరూ సుమారు 800 కేజీల కొకైన్ ను హోండురాస్ మీదుగా అమెరికాకు తరలించేందుకు యత్నించగా, డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేటివ్ (డీఈఏ) అధికారులు హైతీలో అరెస్టు చేసి న్యూయార్క్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఆపై నవంబర్ 7న విచారణ ప్రారంభంకాగా, వీరిద్దరూ దోషులేనని శుక్రవారం నాడు న్యూయార్క్ ఫెడరల్ జ్యూరీ ప్రకటించింది. వీరికి ఏ మేరకు శిక్ష విధించాలన్న విషయాన్ని వచ్చే సంవత్సరం మార్చి 7న ప్రకటిస్తామని వెల్లడించింది.

  • Loading...

More Telugu News