: శ్రీగంజ్ నగర్ జిల్లాలో పట్టాలు తప్పిన ప్యాసింజర్.. ఇద్దరికి గాయాలు
రాజస్థాన్ శ్రీగంజ్ నగర్ జిల్లా గుండా వెళుతోన్న భటిండా-జోధ్‌పూర్ ప్యాసింజర్ ఈ రోజు ఉదయం పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది గాయాలపాలయిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ మార్గం గుండా వెళ్లే ఇతర రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.