: యూపీఏలో కొత్త కుంభకోణాలు బయటకొస్తున్నాయి: సుష్మా స్వరాజ్
యూపీఏ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు కొత్త కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని లోక్ సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్ ఆరోపించారు. దాంతో స్కాంలలో ఇరుక్కున్న మంత్రులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. లోక్ సభ సమావేశాల్లో విపక్ష సభ్యుల ఆందోళన అనంతరం మాట్లాడిన సుష్మ.. సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు.
సంచలనం సృష్టించిన 2జీ స్కాంలో జేపీసీ నివేదికను కేంద్రం తనకు అనుకూలంగా మార్చుకుందని వ్యాఖ్యానించారు. అటు కోల్ స్కాంపై దర్యాప్తు వివరాలను కూడా సీబీఐ నుంచి రహస్యంగా తెలుసుకుందన్నారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని సుష్మ ఆగ్రహించారు. ఇటువంటి ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు ఎప్పుడో కోల్పోయిందన్నారు.