: రెండు వేల నోట్లతో అవినీతి పెరిగే అవకాశం ఉంది: అన్నా హజారే


రెండు వేల రూపాయల నోట్లతో అవినీతి పెరిగే అవకాశాలున్నాయని సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే అభిప్రాయపడ్డారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వారిలో నల్లధనవంతులే ఎక్కువ మంది ఉన్నారన్నారు. కాగా, పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై తన మద్దతు తెలిపిన అన్నా హజారే, తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలాఉండగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వరుసగా మూడో రోజు కూడా పెద్దనోట్ల రద్దు విషయమై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరస్పర ఆరోపణలు, దూషణల కారణంగా ఉభయసభలూ సోమవారానికి వాయిదాపడ్డాయి.

  • Loading...

More Telugu News