: రాజ్యసభలో కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన ప్రత్యేక హోదా బిల్లు ద్రవ్య బిల్లుగా నిర్దార‌ణ‌.. ప్రొసీడింగ్స్ నుంచి తొల‌గింపు


వాయిదా తరువాత ఈ రోజు మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ప్రారంభ‌మైన రాజ్య‌స‌భలో విప‌క్ష స‌భ్యులు త‌మ ప‌ట్టును వీడలేదు. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై ఈ రోజు కూడా చ‌ర్చ చేప‌ట్ట‌వ‌ల‌సిందేనని విప‌క్ష‌నేత‌లు ఛైర్మ‌న్‌ పోడియం వ‌ద్ద‌కు వెళ్లారు. అయితే, స‌భలో గందరగోళం మధ్యే స‌భ్యులు ప‌లు బిల్లులను ప్రవేశపెట్టారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లును ద్రవ్య బిల్లుగా నిర్ధారణ చేసినట్టు డిప్యూటీ ఛైర్మ‌న్ కురియ‌న్ ప్ర‌క‌టించారు. న్యాయ స‌ల‌హా తీసుకున్న త‌రువాతే కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుపై ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌త్యేక‌హోదా బిల్లును ప్రొసీడింగ్స్ నుంచి తొల‌గిస్తున్న‌ట్లు తెలిపారు. అనంత‌రం ప‌లు అంశాల‌పై ఇత‌ర స‌భ్యులు మాట్లాడుతుండ‌గా విప‌క్ష‌నేత‌లు పోడియం వ‌ద్ద త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తుండ‌డంతో రాజ్య‌స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు కురియ‌న్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News