: సుష్మాస్వరాజ్‌కు కిడ్నీ ఇస్తానని లేఖ అందించిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు
కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు కిడ్నీ ఇచ్చేందుకు నిన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ ఎంపీ, సీనియర్ రాజకీయవేత్త రాయపాటి సాంబశివరావు కూడా తన కిడ్నీని ఇస్తానని చెప్పారు. ఈ అంశంపై ఆయన సుష్మాస్వరాజ్ కార్యాలయంలో ఓ లేఖను అందించారు. అందులో తన కిడ్నీని స్వీకరించాలని, కిడ్నీ ఇచ్చేందుకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్ లాంటి నేత దేశ రాజకీయాల్లో ఉండడం ఎంతో అవసరమని, అంతేగాక ఆమె తనకు చిరకాల మిత్రురాలని రాయపాటి సాంబశివరావు మీడియాకు తెలిపారు. సుష్మాస్వరాజ్ గత కొన్ని రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.