: 167 పరుగుల వద్ద కోహ్లీ అవుట్
అద్భుత రీతిలో 150 పరుగులను దాటిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 167 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అలీ బౌలింగ్ లో స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ దారి పట్టాడు. మొత్తం 267 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 18 ఫోర్ల సాయంతో ఈ స్కోర్ సాధించాడు. కోహ్లీ అవుట్ కావడంతో 19 పరుగులతో క్రీజులో ఉన్న అశ్విన్ కు వృద్ధిమాన్ సాహా వచ్చి జత కలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు 103 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 360 పరుగులు. తొలి రోజు ఆటను నాలుగు వికెట్ల నష్టానికి 317 పరుగుల వద్ద ముగించిన భారత్, ఈ ఉదయం నుంచి దూకుడుగా ఆడింది. స్కోర్ బోర్డును సాధ్యమైనంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న క్రమంలో భారీ షాట్ కు యత్నించి కోహ్లీ అవుట్ అయ్యాడు.