: కొత్త నోట్లపై రాతలు రాస్తే ఇక చెల్లవు... బాంబేసిన ఆర్బీఐ!
కొత్తగా విడుదలైన రూ. 500, రూ. 2000 కరెన్సీ నోట్లపై పెన్నుతో ఎలాంటి రాతలు రాసినా అవి చెల్లుబాటు కావని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విషయాన్ని కస్టమర్లకు తెలియజేస్తూ, బ్యాంకుల ముందు నోటీసులు ఉంచాలని అన్ని బ్యాంకులకూ వర్తమానం పంపింది. పాత నోట్లపై అక్షరాలు, సంతకాలు ఉన్నప్పటికీ చెల్లుతాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, కొత్త నోట్లపై అవి ఉంటే చెల్లవని, ఖాతాదారులు విషయాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు చెబుతున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ సూచనల ప్రకారం పలు బ్యాంకుల ముందు ప్లెక్సీలు వెలుస్తున్నాయి.