: ఎంతో ప్లాన్ తో పాత నోట్లను రద్దు చేశాం, ఎంత బెదరించినా వెనకడుగే లేదు: జైట్లీ


పాత కరెన్సీ రద్దును వెనక్కు తీసుకోవాలని విపక్ష పార్టీల నేతలు మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తదితరులు మూడు రోజుల డెడ్ లైన్ విధించడంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. నోట్ల రద్దు ఎంతో పక్కా ప్రణాళికతో తీసుకున్న నిర్ణయమని, ఒకసారి అమలు చేద్దామని నిర్ణయించి, ఆదేశాలు జారీ చేసిన తరువాత, ఎన్ని బెదరింపులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. డీమానిటైజేషన్ నిర్ణయం వెనక్కు తీసుకునే ప్రశ్నే తలెత్తబోదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడంలో బ్యాంకులు, వాటి ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారని, వారి కృషిని అభినందిస్తున్నానని అన్నారు. సెలవులు కూడా లేకుండా వారు పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఏటీఎంలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News