: డిసెంబర్ 30 లోపు రూ. 2 వేలే... మోదీ సర్కారుపై వెల్లువెత్తుతున్న విమర్శలు


నిన్నటి వరకూ పాత కరెన్సీని మార్చుకునేందుకు రూ. 4,500 వరకూ సౌలభ్యం ఉండేది. ఒకరు రోజుకు రెండు సార్లు, మరికొందరు ప్రతి రోజూ, ఇంకొందరు రోజు మార్చి రోజు... ఇలా తమ వద్ద ఉన్న పాత కరెన్సీని బ్యాంకుకు తీసుకెళ్లి క్యూలైన్లలో నిలబడి మార్చుకుంటున్నారు. ఇకపై కరెన్సీ మార్పిడి ద్వారా కేవలం రూ. 2 వేలు మాత్రమే మార్చుకోవచ్చని, అది కూడా డిసెంబర్ 30లోపు ఒక్కసారి మాత్రమే మార్చుకోవాలని తేల్చి చెప్పింది. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రూ. 2 వేలు మాత్రమే మార్చుకుని నెలన్నర రోజులు ఎలా బతకాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో వేసుకుని, ఆపై తీసుకుందామంటే, ఏటీఎం సెంటర్లు పని చేయడం లేదని వాపోతున్న ప్రజలు, ఇలా నగదు మార్పిడిపైనా ఆంక్షలు విధిస్తే ఎలాగని అడుగుతున్న పరిస్థితి నెలకొంది. కాగా, నగదును మార్చుకున్న వారే పదేపదే వస్తుండటం, పేదలను, కూలీలను అడ్డుపెట్టుకుని, వారిని క్యూలైన్లలో ఉంచి, అక్రమార్కులు తమ బ్లాక్ మనీని వైట్ గా మారుస్తున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలోనే మార్పిడి పరిమితిని తగ్గించినట్టు అధికారులు చెబుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News