: ఆర్బీఐ, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అధికారులపై చంద్రబాబు అసంతృప్తి
ఆర్బీఐ, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అధికారుల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దనోట్ల మార్పిడి, పరిణామాలపై బ్యాంకర్లతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. కాగా, పెద్దనోట్ల రద్దు ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడింది. చిన్ననోట్ల కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న ప్రజలు, ఏటీఎంలలో సరిపడా చిన్ననోట్లు ఉండకపోవడం తెలిసిందే.