: సుష్మా కు కిడ్నీ దానం చేస్తానంటున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్


మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు కిడ్నీ దానం చేసేందుకు తాను రెడీ అంటున్నాడు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. టికంగఢ్ జిల్లా తిహర్క గ్రామానికి చెందిన 26 ఏళ్ల గౌరవ్ సింగ్ దంగి ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలిపాడు. సుష్మా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అందుకే, తన కిడ్నీని ఆమెకు దానం చేస్తానని చెప్పాడు. కిడ్నీ ఎందుకు దానం చెయ్యాలనుకుంటున్నావని మీడియా ప్రశ్నించగా, ‘సుష్మా పనితీరు నన్ను ఆకట్టుకుంది. ఆమె మంచి నాయకురాలు. అందుకే, నా కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నాను’ అని గౌరవ్ సింగ్ దంగి పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News