: పెద్దనోట్ల రద్దు గొప్ప చర్య : ‘ఫేస్ బుక్’ భారత్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడం గొప్పచర్య అని ‘ఫేస్ బుక్’ మేనేజింగ్ డైరెక్టర్ (భారత్) ఉమాంగ్ బేడీ ప్రశంసించారు. బెంగళూరులో నిర్వహించిన గ్లోబల్ మొబైల్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్- 2016 లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ‘డిజిటల్ డిస్రప్షన్ ఈజ్ జెస్ట్ ది బిగినింగ్’ అనే అంశంపై ఉమాంగ్ బేడీ మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు గొప్ప చర్య అని, తాత్కాలికంగా నగదు కొరత కారణంగా ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారని అన్నారు. అయితే, కొత్తనోట్లు వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఈ-కామర్స్ లో అమ్మకాలు ప్రస్తుతం తగ్గినా అది తాత్కాలికమేనని, మళ్లీ పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు.