: మల్లికా శెరావత్ ను చితక్కొట్టిన దుండగులు!


ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ ను దుండగులు చితక్కొట్టారు. వివరాల్లోకి వెళ్తే... మల్లిక బాలీవుడ్ లో అడల్ట్ సినిమాలు, ఐటెం సాంగ్ లు చేస్తూ జాకీచాన్ తో 'ది మిత్', 'హిస్' సినిమాల్లో నటించింది. దీంతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైంది. అక్కడ ఫ్రెంచ్ వ్యాపారవేత్త సిరిల్‌ ఆక్సన్‌ ఫాన్స్‌ తో ప్రేమలో పడింది. ఇప్పుడు అతనితోనే ఫ్రాన్స్ లోని పారిస్ లో సహజీవనం చేస్తోంది. ఈ రోజు బయటికి వెళ్లి వచ్చి, ప్రియుడితోపాటు తానుంటున్న ఫ్లాట్ లోపలికి వెళ్లింది. వెంటనే ఆ ఫ్లాట్ లోపలికి ప్రవేశించిన ముగ్గురు దుండగులు టియర్ గ్యాస్ విడుదల చేసి, ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో అవాక్కయిన మల్లికా శెరావత్, ఆమె ప్రియుడు ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేసినట్టు అక్కడి మీడియా పేర్కొంది. కాగా, అదే నగరంలో ప్రముఖ అమెరికన్ టీవీ నటి కిమ్ కర్దాషియాన్ పై దాడి, దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మల్లికపై కూడా దాడి జరగడంతో ఈ దాడులు కేవలం సెలబ్రిటీలైన శ్వేత జాతీయేతరులపైనే జరుగుతున్నాయా? అన్న అనుమానం కలుగుతోంది.

  • Loading...

More Telugu News