: గుజరాత్ లో భారీ మొత్తంలో కొత్త నోట్ల లంచం వ్యవహారం!
గుజరాత్ లో వెలుగు చూసిన లంచం వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గుజరాత్ లోని కచ్ లోని కండ్ల పోర్ట్ ట్రస్ట్ లో సూపరింటెండెంట్ ఇంజినీర్ గా పని చేస్తున్న శ్రీనివాసు, సబ్ డివిజినల్ అధికారి కుంటేకర్ లకు కొత్త రూ. 2000 నోట్లతో 4 లక్షల రూపాయల లంచం అందింది. వీరి తరఫున ఈ మొత్తాన్ని రుద్రేశ్వర్ సునముడి అనే వ్యక్తి స్వీకరిస్తుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ప్లాన్ ప్రకారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో పెద్ద మొత్తంలో కొత్త నోట్లను చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద మొత్తంలో కొత్త నోట్లు లంచం ఇవ్వడానికి ఎలా వచ్చాయన్న విషయాన్ని కూడా పోలీసులు విచారిస్తున్నారు.