: కత్రినాపై జోక్ లకు నవ్వు ఆపుకోలేకపోయిన రణ్ బీర్ కపూర్
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పై రణ్ వీర్ సింగ్ వేసిన జోక్ లకు ఆమె మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహర్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి ఈ ఇద్దరు నటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్, దీపికా పదుకొనే గురించిన ప్రశ్నలను ఆ నటులకు సంధించారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు జవాబు చెబుతూ, సినిమా మొత్తంలో కత్రిన హావభావాలు ఒకేలా ఉంటాయని రణ్ వీర్ సింగ్ అనడంతో ఆమె మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆరేళ్ల తమ ప్రేమ విఫలమైనందుకు తనకు ఎటువంటి బాధా లేదని రణ్ బీర్ కపూర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.