: అత్యాచార ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్ క్షమాపణలు చెప్పాలి: సుప్రీంకోర్టు
నోయిడా అత్యాచార ఘటనపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. జస్టిస్ దీపక్ మిశ్రా, సి.నాగప్పన్ లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పును ఇచ్చింది. ఒక ప్రజాప్రతినిధి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. కాగా, జులై 29న నోయిడాకు చెందిన ఒక కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా దానిని అడ్డుకున్న కొందరు దుండగులు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయ కుట్ర అని ఆరోపిస్తూ ఆజంఖాన్ నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఈ విషయమై ఆజంఖాన్ ను విచారించాలని బాధిత బాలిక సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది.