: మీకు దగ్గర్లో ఏ ఏటీఎం వుందో ఇలా తెలుసుకోవచ్చు!


500, 1000 రూపాయల నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా నగదు కష్టాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. బ్యాంకులు ఏ ఏటీఎంలలో డబ్బులు పెడుతున్నాయి? ఎక్కడెక్కడ ఏటీఎంలు ఉన్నాయి? వంటి సమాచారం తెలియక చాలా మంది ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ఇబ్బందిని ఎదుర్కొన్న గోవా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డబ్బులున్న ఏటీఎంల వివరాలతో సోషల్ మీడియాలో ఒక యాప్ ను పెట్టాడు. ఇది ఢిల్లీ, తరువాత ముంబై, బెంగళూరు, కోల్ కతాల్లోని యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు స్పూర్తిగా నిలిచి కొత్త యాప్ లు తయారు చేసేందుకు స్పూర్తినిచ్చింది. తాజాగా, గూగుల్ సంస్థ ఇదే సాఫ్ట్ వేర్ తో మీ దగ్గర్లో ఏ ఏ ఏటీఎంలు ఎక్కడెక్కడ వున్నాయో తెలిపే సాఫ్ట్ వేర్ ను గూగుల్ డూడుల్ కు జత చేసింది. సాధారణంగా గూగుల్ డూడుల్ కింద గూగుల్ సెర్చ్...ఐ యామ్ ఫీలింగ్ లక్కీ అనే రెండు పదాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. దాని కింద 'ఫైండ్ ఎన్ ఏటీఎం నియర్ యూ' అంటూ ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దాని ఆధారంగా మీకు దగ్గర్లోని ఏటీఎంల సమాచారం చూపిస్తుంది.

  • Loading...

More Telugu News