: ఇబ్బందులను తొలగించేందుకు వేగంగా చర్యలు.. భారీ మొత్తంలో ముద్రితమవుతున్న కొత్త నోట్లు
పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ వేగంగా చర్యలు తీసుకుంటోంది. కొత్తనోట్లను ముద్రించే పనిలో నిమగ్నమైంది. ప్రతిరోజు మిలియన్ల కొద్దీ నోట్లను ముద్రిస్తూ వాటిని త్వరలోనే ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం మొత్తం మూడు ప్రింటింగ్ ప్రెస్‌లను ప్రధానంగా ఉపయోగిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రయివేట్ లిమిటెడ్, బ్యాంక్ నోట్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్, నాసిక్ ప్రెస్ ల ద్వారా కొత్త నోట్ల ముద్రణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టింది. బీఆర్బీఎన్ఎంపీఎల్ ద్వారా దాదాపు 4 కోట్ల రూ.2 వేల నోట్లను ముద్రిస్తోంది. బీఎన్పీ దివస్ లో 90 లక్షల రూ.500 నోట్లను, నాసిక్ ప్రెస్ లో దాదాపు కోటి 80 లక్షల రూపాయల కరెన్సీ నోట్లను, అందులో ప్రధానంగా 50 లక్షల రూ. 20 రూపాయల నోట్లను ముద్రిస్తోంది. అలాగే కోటి రూ.100 నోట్లను కూడా ముద్రిస్తోంది.